వయసు 13, పర్యావరణ పరిరక్షణపై కృషి .. అమెరికాలో తెలుగు బాలుడికి ‘‘ ప్రిన్సెస్ డయానా ’’ అవార్డ్..!!

చిన్న వయసులోనే పర్యావరణాన్ని కాపాడాలనే మహత్తర లక్ష్యంతో కృషి చేసిన తెలుగు బాలుడు శ్రీనిహాల్ తమ్మనకు అమెరికాలో అరుదైన దక్కింది.

ప్రతిష్టాత్మక ‘‘ప్రిన్సెస్ డయానా( Princess diana )’’ పురస్కారం అతనిని వరించింది.

చిన్నతనం నుంచే పర్యావరణంపై మెండుగా స్పృహ వున్న శ్రీనిహాల్‌(( Sri Nihal Tammana ) కు బ్యాటరీల వల్ల ప్రకృతికి ఎలాంటి ముప్పు కలుగుతోందో తెలిసింది.ఎంతో ఆలోచించి దీనికి రీ సైక్లింగ్ ఒక్కటే మార్గమని భావించి బ్యాటరీల రీసైక్లింగ్‌ను ఒక ఉద్యమంలా చేపట్టాడు.

ఈ కార్యంలో తన తోటి విద్యార్ధులను కూడా భాగస్వాములుగా చేశాడు.ఇళ్లలో వినియోగించిన బ్యాటరీలను సేకరించి వాటిని రీ సైక్లింగ్ చేయడం ప్రారంభించాడు నిహాల్.

అలా ఇప్పటి వరకు దాదాపు 2,75,000లకు పైగా బ్యాటరీలను రీ సైక్లింగ్ చేశాడు.అంతేకాదు.

Advertisement

బ్యాటరీ రీ సైక్లింగ్‌పై( Battery re-cycling ) పాఠశాలల్లో క్యాంపెయిన్‌లు కూడా చేశాడు.అలా దాదాపు 1.25 కోట్ల మందిలో నిహాల్ చైతన్యం తెచ్చాడు.ఈ బాలుడు చేస్తున్న కృష్టికి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి.

తాజాగా ప్రిన్సెస్ డయానా అవార్డ్‌ను శ్రీనిహాల్‌కు ప్రకటించారు.సమాజంలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచించే యువతను ఈ పురస్కారంతో సత్కరిస్తారు.

ఇకపోతే.గోదావరి నదిని ప్రక్షాళన చేసేందుకు ఇటీవల తెలుగు బాలిక కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాలోని మెంఫిస్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఉమాశ్రీ పూజ్యం అనే బాలిక ‘‘సేవ్ గోదావరి’’ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

కొద్దిరోజుల క్రితం ఆమె తన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా రాజోలు సమీపంలోని పొన్నమండను సందర్శించినప్పుడు గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకోవడాన్ని చూసి ఈ మిషన్‌ను ప్రారంభించింది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

గత రెండేళ్లుగా కాలుష్య సమస్యను పరిష్కారించడానికి స్థానిక కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లను ఒకచోట చేర్చి గోదావరి ప్రక్షాళన పనులు మొదలుపెట్టింది.అది ఇప్పుడు 100 రోజులకు చేరింది.వ్యర్ధాలను సరైన విధంగా పారవేయడం, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని తగ్గించే మార్గాల గురించి ఉమాశ్రీ స్థానికులకు వివరిస్తోంది.నీటి కాలుష్యంపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ‘‘యూత్ ఎగైనెస్ట్ వాటర్ పొల్యూషన్( Youth Against Water Pollution )’’ సంస్థను ఉమాశ్రీ స్థాపించింది.2021లో వర్చువల్ మోడ్‌లో తరగతులు నిర్వహించినప్పుడు .ఆమె చాలా నెలల పాటు భారత్‌లోనే వుండి మిషన్ కోసం సమయాన్ని వెచ్చించింది.వీటితో పాటు సోషల్ మీడియా, వెబ్‌సైట్ ద్వారా కూడా కాలుష్యంపై అవగాహన కల్పించింది.

Advertisement

ప్రస్తుతం ఉమాశ్రీ పదో తరగతి చదువుతోంది.వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందులను అధికంగా ఉపయోగించడం వల్ల ఇక్కడి నీరు వాగుల ద్వారా గోదావరిలోకి చేరి కలుషితమవుతున్నట్లు గుర్తించానని ఆమె పేర్కొంది.

ఈ క్రమంలోనే నదీ ప్రక్షాళన, పర్యావరణ మిషన్‌ను చేపట్టేలా చేసిందని ఉమాశ్రీ వెల్లడించింది.తన ప్రయత్నానికి అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, స్థానిక అధికారులు, ప్రజలు తనకు ఎంతో సహకారం అందించారని పేర్కొంది.

తాజా వార్తలు