చిన్నతనంలో అందరం దొంగతనం చేస్తాం.దొంగతనాల వరకు ఓకే కాస్త పెద్ద అయ్యాక అలవాటు మానుకుంటాం.అందరి ఇళ్లల్లో సహజంగా జరిగే ప్రక్రియ.ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి స్థానం అనుభవిస్తున్న ఓ నటి దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది.అలాంటి ఒక సంఘటన మన టాలీవుడ్ హీరోయిన్ కి ఎదురైంది.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సావిత్రి తో పాటు సమానంగా రెమినేషన్ అందుకుంటున్న హీరోయిన్ సరోజా దేవి. ఆమెను సరోజినీ దేవి అని కూడా అంటూ ఉంటారు.
ఆమెకి దొంగతనం చేయడం ఒక అలవాటు అందుకే షూటింగ్ లోకేషన్ లో ఏది కనిపిస్తే అది సర్దేస్తూ ఉంటుంది.కెమెరా లెన్సుల నుంచి పక్క నటుల హెయిర్ పిన్స్ వరకు ఆమె అన్ని దొంగిలించి బ్యాగ్ లో వేసుకుంటుంది.
ఆమె ఒక స్టార్ హీరోయిన్ కావడంతో ఎవరు ఆమెను అనుమానించలేదు.షూటింగ్ లొకేషన్లో పోయే వస్తువుల వలన ఒక్కోసారి ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయట.
అలా ఆమెకు చేతివాటం బాగా అలవాటయింది.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఓసారి తమిళ హీరో ఎంజీఆర్ తో ఊటీలో షూటింగ్ చేయాల్సి వచ్చింది.
ఇక్కడ ఆమె ఎప్పుడూ తీసుకునే ఫైవ్ స్టార్ హోటల్ లోనే రూమ్ కావాలని డిమాండ్ చేయడంతో యూనిట్ కూడా కాదనలేక అదే హోటల్లో రూమ్ బుక్ చేశారు.కానీ సరోజినీ దేవి హోటల్ కి వస్తుందంటే చాలు సదరు హోటల్ ఆర్గనైజర్స్ కి ఎప్పుడు అనుమానం ఉండేది.
ఎందుకంటే సరోజినీ దేవి ఏ గదిలో దిగిన ఆ రూమ్ లోని సామాను అంతా కూడా ఖాళీ అవుతుంది.హోటల్లోని టవల్స్, దుప్పట్లు, లైట్స్ తో సహా ఆఖరికి బాత్రూంలోని మగ్స్ కూడా ఆమె తన బ్యాగులో సర్దుకొని వెళ్లిపోవడం అలవాటైపోయింది.
కానీ ఈసారి హోటల్ మేనేజ్మెంట్ అలా వదిలేయడానికి సిద్ధంగా లేక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.షూటింగ్ అయిపోయి తిరిగి వెళుతున్న సరోజినీ దేవి బ్యాగ్ ని చెక్ చేయాలని పట్టు పట్టారు.అలా చెక్ చేయడంతో అందులో ఉన్న సామాను అంతా కూడా బయటపడి ఆమె పరువు పోయింది.పక్కనే ఉన్న ఎంజీఆర్ ఏదోలా విషయాన్ని సర్దుబాటు చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
యూనిట్లో ఎవరికి మోహం చూపించలేక ఎంతో ఇబ్బంది పడింది సరోజిని.అంత ఆస్తి ఉన్న ఆమెకు ఇదేం పోయేకాలం అని అందరూ అనుకున్నా వాస్తవానికి ఆమెకు ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉండటం.దొంగతనం చేయడం ఆ డిజార్డర్ యొక్క లక్షణం.దాంతో దొంగతనాలు చేయడం బాగా అలవాటయింది సరోజినీ దేవికి.
.