తెలుగులో అభిషేకం, ఆడదే ఆధారం, ఇంటి గుట్టు, తదితర ధారావాహికల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బుల్లితెర సీరియల్ హీరోయిన్ “చరిష్మా నాయుడు” గురించి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే తాజాగా చరిష్మా నాయుడు తన భర్తతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సీరియల్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఎలా ఉంటాయన్న విషయంపై స్పందించింది.
అయితే ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీతో పోలిస్తే సీరియల్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తెలిపింది.అంతేగాక తాను గతంలో పలు చిత్రాలలో నటించానని ఆ సమయంలో కొంతమంది తనని కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా తాను అవకాశాల కోసం పలువురు దర్శక నిర్మాత ఆఫీసులకి వెళ్ళినప్పుడు కూడా “అవకాశం ఇస్తే కమిట్మెంట్ ఇస్తావా” అని కొంతమంది డైరెక్టుగా అడిగే వాళ్ళని తెలిపింది.కానీ తాను ఏ రోజు కూడా అవకాశాల కోసం అడ్డదారులు తొక్కలేదని స్పష్టం చేసింది.
కానీ సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం తాను ఇప్పటివరకు ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలని ఎదుర్కోలేదని అందువల్లనే తాను సినిమా పరిశ్రమకు వెళ్లకుండా సీరియల్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారని కూడా తెలిపింది.అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది దర్శక నిర్మాతలు మంచివాళ్లే అయినప్పటికీ కొంతమంది అవకాశాల పేరుతో నూతన నటీనటులను వాడుకోవాలని చూస్తారని, ఇందులో ఎక్కువగా ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఉంటారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నటువంటి కొందరు పెద్దలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ సమస్యలకు దూరంగా ఉంటారని అందువల్లనే వారు ఇప్పటివరకు సినిమా పరిశ్రమలో చాలా సురక్షితంగా కొనసాగుతున్నారని కూడా తెలిపింది.
అయితే గతంలో తాను ఓంకార్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన “రాజుగారి గది 3” చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించానని, కాగా ఆ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా పని చేశాడని తెలిపింది.
అయితే ఆ సమయంలో తాము ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లం కావడంతో చోటా కె.నాయుడు తనతో చాలా సరదాగా ఉండేవాడిని అంతేగాక అప్పుడప్పుడు తాను ఇంతకు ముందే పరిచయం అయి ఉంటే కచ్చితంగా పెళ్లి చేసుకునేవాడినని అంటూ సరదాగా నవ్వించేవాడని తెలిపింది.