పాపం... ఈ నటి హీరోయిన్ అవ్వాలని వచ్చి అలాంటి చిత్రాల్లో నటించిందట... దాంతో...

తెలుగు చిత్రాలలో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో ప్రేక్షకులను బాగానే అలరించిన "సీనియర్ నటి జయలలిత" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే జయలలిత కూడా అందరి నటీనటులలాగే కోటి ఆశలతో తన నటనా ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకి వచ్చింది.

కానీ పలు అనివార్య కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది.అంతేగాక ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక ఖాళీగా గడిపింది.

 దాంతో కొంతమేర బోల్డ్ తరహా పాత్రలో నటించే అవకాశాలు రావడంతో నటన పరంగా తన ప్రతిభను నిరూపించుకునేందుకు వ్యాంప్ తరహా పాత్రలో కూడా నటించింది.కానీ చివరికి జయలలితకు ఆ వ్యాంప్ తరహా పాత్రలే నటిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టడమే కాకుండా 100 కి పైగా చిత్రాలలో కామెడీ మరియు బోల్డ్ తరహా పాత్రలలో నటించే అవకాశాలను తెచ్చిపెట్టాయి.

అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జయలలిత తాను నటించినటువంటి పాత్రల కారణంగా తన భర్త తనను నిత్యం వేధింపులకు గురి చేసేవాడని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.అంతేకాక ఇక ఒక నటిగా తాను తన పాత్రకు వంద శాతం న్యాయం చేసేందుకు ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తానని తెలిపింది.

Advertisement

అయితే ఈ మధ్య కాలంలో జయలలితకు సినిమా అవకాశాలు తలుపు తట్టకపోయినప్పటికీ ధారావాహికలలో నటించే అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. దీంతో ప్రస్తుతం జయలలిత తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం అనే చిత్రం ధారావాహికలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు