తెలుగు నిర్మాతల మండలి ఇటీవల సంక్రాంతి మరియు దసరా పండుగ సీజన్ల లో కచ్చితంగా తెలుగు సినిమా లకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని.పెద్ద సినిమాలైనంత మాత్రాన వేరే భాష సినిమా లకు థియేటర్స్ కేటాయించాల్సిన అవసరం లేదు అంటూ డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మరియు థియేటర్ల ఓనర్లకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఒకవేళ తమ నిర్ణయం కాదని డబ్బింగ్ సినిమా లకు దసరా మరియు సంక్రాంతి సీజన్ సమయం లో థియేటర్లు ఇస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ ఈ సందర్భం గా నిర్మాతల మండలి హెచ్చరించడం జరిగింది.దాంతో మరో సారి డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లకు ఉత్తరాంధ్ర ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కి తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి లేఖ వెళ్ళింది.

సంక్రాంతి మరియు దసరా పండుగ రోజుల్లో ప్రదర్శించే తెలుగు సినిమా లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అంటూ అందులో పేర్కొన్నారు.తెలుగు సినిమాలు కాకుండా వేరే భాష సినిమాలకు థియేటర్స్ కేటాయిస్తే భవిష్యత్తు లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్లుగా ఫిలిం డిస్టిబూటర్స్ అసోసియేషన్ కి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుగు నిర్మాతల మండలి లేఖలో పేర్కొంది.మొత్తానికి సంక్రాంతి కి విడుదల కాబోతున్న తెలుగు సినిమా లకు కాస్త ఊరట ఇచ్చే విధంగా ఈ లేఖ ఉంది అనడం లో సందేహం లేదు.వారసుడు సినిమా ను తెలుగు సినిమా గానే దిల్ రాజు చెప్పుకొస్తున్నాడు.
అదే సమయం లో అజిత్ కుమార్ నటించిన సినిమా కూడా తెలుగులో విడుదల కావాల్సి ఉంది.కనుక ఆ సినిమా విడుదల కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా తెలుగు సినిమా లు అయినటువంటి వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరన్న కు మాత్రమే ప్రాముఖ్యత దక్కే అవకాశం ఉంది.
ఈ సంక్రాంతికి ఆ సినిమాల జోరు ఇక్కడ లేనట్లే అని క్లారిటీ వచ్చేసింది.







