కోవిడ్ సంక్షోభం.. తోటి ప్రవాసులకు చేయూత, తెలుగు ఎన్ఆర్ఐకి అబుదాబీలో సన్మానం

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గడిచిన రెండేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.

అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.

ఆసుపత్రులకు జనం పరుగులు.పక్కవాడు తుమ్మినా, దగ్గినా వాడిని నేరస్తుడిని చూసినట్లు చూడటం, వేరే వూరి నుంచి వస్తే సొంతవాళ్లనైనా అడుగుపెట్టనీయకపోవడం, కోట్ల ఆస్తి, బంధుగణం వున్నా దిక్కులేని వాడిలా అంత్యక్రియలు ఇలా కనీసం కలలో కూడా ఊహించని దారుణాలు ఎన్నో.

Advertisement

వీటన్నింటికి మించి అయినవారిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం.ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు మొదలైనా ఈ మహమ్మారి మనిషికి లొంగడం లేదు.

తనకు తాను ఉత్పరివర్తనం చెంది మానవాళికి సవాల్ విసురుతోంది.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశం కానీ దేశంలోనూ తోటివారికి చేయూతను అందిస్తున్నారు పలువురు ప్రవాస భారతీయులు.

ఆశ్రయం కోల్పోయి దేశానికి వెళ్లలేక విమానాశ్రయాల్లో బిక్కుబిక్కుమంటున్న వారికి వసతి, ఆహారం, మందులతో పాటు కోవిడ్ కారణంగా మరణించిన వారిని భారత్‌కు పంపడం.ఒకవేళ వీలులేని పక్షంలో అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం వంటి ఎన్నో రకాల సేవలను నిర్వర్తించి మానవత్వం చాటుకున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో తోటి ప్రవాసీయులను ఆదుకున్న ఎన్ఆర్ఐలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడి భారత రాయబార కార్యాలయం సత్కరించింది.వీరిలో వరంగల్‌కు చెందిన రాజ శ్రీనివాసరావు కూడా ఒకరు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈ మేరకు బుధవారం అబుదాబిలో భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ.

Advertisement

యూఏఈలో ఉన్న 34 లక్షల మంది ప్రవాసీయుల భద్రత, సంక్షేమం భారత ప్రభుత్వ కర్తవ్యమన్నారు.ఇకపోతే వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు స్థానిక ఆద్నాక్‌ చమురు ఉత్పాదాక సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

అలాగే అబుదాబిలో తెలుగు ప్రవాసీయుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.కరోనా సంక్షోభం వేళ శ్రీనివాసరావు.

భారతీయ క్లబ్‌ తరఫున చేసిన సేవలకు గాను బిర్లా ఫౌండేషన్‌ ఇప్పటికే సత్కరించింది.

తాజా వార్తలు