తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.కెనడా కీలక నిర్ణయం ప్రవాసుల కు భారీ లబ్ధి

   

కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కలిగిన విదేశీయుల తల్లిదండ్రులకు ఇచ్చే సూపర్ వీసాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ వీసాల గడువు విషయంలో సడలింపు ఇచ్చింది.సింగిల్ ఎంట్రీపై ఐదేళ్ల వరకు మినహాయింపు ఇచ్చింది. 

2.  సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదం .తెలుగు వ్యక్తి మృతి

 సౌదీ అరేబియా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్క పేట కు చెందిన మొగుల్ల మధు (35 ) అనే వ్యక్తి మృతి చెందారు.   

3.భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన

   

 కువైట్ లో ని ప్రవాసులకు ఎంబసీ కీలక సూచనలు చేసింది.పాస్ పోర్ట్, వీసా సేవలను అందించే జలిబ్, ఫహాహీల్ లోని బీఎల్ ఎస్ ఔట్ సోర్సింగ్ కేంద్రాలను తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. 

4.పాకిస్తాన్ లో మరో హిందూ ఆలయం పై దాడి

 

పాకిస్తాన్ లో మరో హిందూ ఆలయాలపై దాడి జరిగింది.  కరాచీలోని కోరంగి ప్రాంతంలోని శ్రీమరీ మాతా మందిరంలో దేవతా మూర్తుల ప్రతిమలను దుండగులు ధ్వంసం చేశారు. 

5.భారత్ స్పందించిన తీరు పై ఇరాన్ సంతృప్తి

  మహమ్మద్ ప్రవక్త పై బీజేపీ నేతలు నూరుప్ శర్మ నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై బిజెపి చర్యలు తీసుకోవడం,  ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని ప్రకటన చేయడం పై ఇరాన్ స్పందించింది.ఈ వివాదంపై భారత్ వైఖరిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. 

6.దక్షిణ కొరియా లో అగ్నిప్రమాదం.ఏడుగురు మృతి

 

Advertisement

దక్షిణ కొరియా లోని ఓ ఆఫీస్ బిల్డింగ్ లో చెలరేగిన మంటల్లో ఏడుగురు మృతి చెందారు. 

7.హైదరాబాద్ స్టార్ట్ అప్ వ్యవస్థాపకునికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు

 

హైదరాబాద్కు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు , ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ ద్వారా నీటి నిర్వహణ కోసం గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మార్గదర్శకుడిగా గుర్తింపు పొందిన రామకృష్ణ ముక్కవిల్లి కి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. 

8.భారత సరిహద్దుల్లో చైనా వంతెన నిర్మాణం.

అమెరికా ఆందోళన

 లడఖ్ లో చైనా మరో వంతెన నిర్మాణం చేపట్టడం ఉపగ్రహ ఫోటోల ద్వారా బయటపడింది.పాంగాంగ్ సరస్సు పై చేపట్టిన అక్రమ వంతెన నిర్మాణం తుది దశకు చేరడంతో పాటు మూడు మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది.భారత సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు దిగడం పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 

9.ఇరాన్ లో పట్టాలు తప్పిన రైలు.17మంది మృతి

   

సెంట్రల్ ఇరాన్ నగరమైన తబస్ కి సమీపంలో బుధవారం ఒక రైలు పట్టాలు తప్పడం తో 17 మంది మరణించారు. 

10.భారత్ కు డచ్ ఎంపీ మద్దతు

 మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కుంటున్న నుపూర్ శర్మ తో పాటు భారత్ కు మద్దతు ప్రకటించాడు  డచ్ ఎంపీ గీర్ట్ వైల్దర్స్ అనే ఎంపీ.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు