తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.డల్లాస్ లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ రక్తదాన శిబిరం

  డల్లాస్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

 

2.భారత్ నుంచి కువైట్ కు విమానాల పై గందరగోళం

  కువైట్ కు డైరెక్ట్ విమానాలపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన నెలకొంది. 

3.నర్సుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం

  కువైట్ లోని ప్రభుత్వ ఆసుపత్రులు లింక్స్ లో పనిచేసే నర్సులకు షిఫ్టింగ్ , రిస్క్ అలవెన్స్ లపై అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నర్సులు అనుభవం వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న స్థాయినిబట్టి 450 - 850 కువైట్ దినార్లు, షిఫ్టింగ్ రిస్క్, అలవెన్సులు ఉంటాయని అధికారులు తెలిపారు. 

4.అబుదాబిలో లాటరీ గెలుచుకున్న భారతీయుడు

 రవి బిగ్ టికెట్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో ఓ భారతీయుడికి జాక్ పాట్ తగిలింది.రాస్ అల్ ఖైమ లో ఉండే భారత ప్రవసుడు అబు మహ్మద్ ఆగస్టు 30న నలుగురు స్నేహితులతో కలిసి అతను లాటరీ టికెట్ కి 12 మిలియన్ దిర్హంస్ ( 23.84 కోట్లు ) గెలుచుకున్నాడు. 

5.ఒమన్ వెళ్ళాలంటే ఇది తప్పనిసరి

  కరుణ విజృంభిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ దేశంలోకి వచ్చే ఎన్నికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.తాజాగా ఒమన్ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది.తమ దేశానికి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ 19 ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని ప్రకటించింది. 

6.మోదీ అమెరికా పర్యటన

Advertisement

  ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.సెప్టెంబర్ చివరి వారంలో ఆయన పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది. 

7.న్యూజిలాండ్ లో కరోనా మరణం

  న్యూజిలాండ్ లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది.ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య అధికారులు ధ్రువీకరించారు. 

8.ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సినీ పరీక్షిస్తున్న నాసా

  అమెరికాకు చెందిన నాసా ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ పరీక్షించింది.ఈ వాహనంతో కొత్త తరహా రవాణా  వ్యవస్థకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

9.ఆఫ్ఘన్ పౌరుల హత్యలపై విచారణ జరపాలి

  గత ఇరవై సంవత్సరాల కాలంలో ఆఫ్ఘనిస్థాన్లో వేలాది మంది సాధారణ పౌరులు ని అమెరికా దాని మిత్రదేశాలు సైనికులు చంపాలని ఇప్పుడు ఆ హత్యలపై సమగ్ర విచారణ జరిపి హంతకులను శిక్షించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాంగ్ డిమాండ్ చేస్తున్నారు. 

10.పాక్ సాయంతో ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటు

  ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పాకిస్థాన్ సహాయం తో చైనా ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.   .

Advertisement

తాజా వార్తలు