తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారతీయులకు శుభవార్త : ఆంక్షలు ఎత్తివేసి అమెరికా

అమెరికా భారతీయులకు శుభ వార్త చెప్పింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో భారత్ తో సహా అనేక దేశాలపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. 

2.కువైట్ లో భారతీయుడి మృతి

  గల్ఫ్ దేశం కువైట్ లో ఓ భారతీయ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యం అయ్యింది.

ఫాహాహీల్ లోని ఓ పాడుబడ్డ భవనం లో ఈ మృత దేహం ఉంది.అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.మృతుడు భారత్ లోని కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన మహమ్మద్ ఆన్సర్ గా గుర్తించారు. 

3.వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణ ఆవిష్కరణ

  భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంథాన్ని సోమవారం ఆవిష్కరించారు. 

4.నేటి నుంచి సింగపూర్ వెళ్లేందుకు భారతీయులకు అనుమతి

  అక్టోబర్ 26 నుంచి భారత ప్రయాణికులు సింగపూర్ వెళ్లొచ్చు.ఈ మేరకు ఆదేశం విధించిన ఆంక్షలు ఎత్తివేసింది. 

5.చైనాలో కరోనా ఉధృతి .మళ్లీ లాక్ డౌన్

Advertisement

  చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది.ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే ఆలోచనలో చైనా ఉంది. 

6.కోవాగ్జీన్ టీకా పై డబ్ల్యు హెచ్ వో సమీక్ష

  భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవిడ్ టికాపై సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించనునట్టు  ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హారీస్ పేర్కొన్నారు. 

7.సూడాన్ లో సైనిక తిరుగుబాటు

  సూడాన్ ప్రభుత్వం పై సైన్యం తిరుగుబాటు చేసింది.సోమవారం రాత్రి ప్రభుత్వం నుంచి అధికారాన్ని సైన్యం లాక్కొంది. 

8.దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు మృతి

  దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ తై వూ (88) అనారోగ్యం తో మృతి చెందారు. 

9.సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి

  జపాన్ యువరాణి మాకో రాచరిక హోదాను వదులుకుని ప్రియుడు కోమరో ను మంగళవారం వివాహం చేసుకుంది. 

10.మూడేళ్ల చిన్నారులకూ టీకా : చైనా

  చైనాలో ఇప్పుడు 3- 11 ఏళ్ల మధ్య వయసున్న వారికి టీకా వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు