తెలుగు లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశ ముదురు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “హన్సిక మోత్వాని” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
దీంతో కొంతకాలం పాటు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, అంటూ తేడా లేకుండా సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడిపింది.కానీ ఒకానొక సమయంలో సినిమా షూటింగుల బిజీ లో పడి ఆహారపు అలవాట్లపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో మధ్యలో కొంతమేర బరువు పెరిగింది.
అయినప్పటికీ హన్సిక కి సినిమా ఆఫర్లు మరియు ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
అయితే ఈ మధ్య కాలంలో నటి హన్సిక సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది.
కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.నటి హన్సిక బికిని దుస్తులు ధరించి సముద్రం బీచ్ లో కనిపించింది.
దీంతో ఒక్కసారిగా హన్సిక అభిమానులు అవాక్కయ్యారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో హన్సిక బరువు కూడా బాగానే తగ్గిందని కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ఎప్పుడూ కూడా ఓవర్ ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉండేటువంటి హన్సిక ఉన్నట్లుండి బికినీ దుస్తుల్లో కనిపించడంతో కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్లో హీరోయిన్ గా రాణించాలంటే గ్లామర్ డోస్ పెంచాలని లేకపోతే సినిమా అవకాశాలు వరించడం కష్టమని అందువల్లనే హన్సిక తన అందాలను ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలె హన్సిక తెలుగులో హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ బి.ఏ బిఎల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.దాంతో ఈ అమ్మడు తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.కాగా ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న “మై నేమ్ ఈజ్ శృతి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే మరో మూడు తమిళ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నట్లు సమాచారం.