తెలుగులో యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అల్లరి నరేష్ నటించిన “గమ్యం” అనే చిత్రానికి దర్శకత్వం వహించి వచ్చీ రావడంతోనే తన మొదటి చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ విభిన్న కథనాలను ఎంచుకుంటూ క్రిష్ జాగర్లమూడి ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.
కాగా తాజాగా ఓ పత్రిక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని బాలీవుడ్లో మణికర్ణిక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో జరిగినటువంటి కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా తాను స్క్రిప్ట్ పరంగా ముందుకు వెళుతూ సినిమాని పూర్తి చేసే సమయంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన కంగనా రనౌత్ దర్శకత్వం మరియు ఈ చిత్రంలోని సోనుసూద్ పాత్ర నిడివి వంటి విషయంలో జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య కొంతమేర విభేదాలు వచ్చాయని తెలిపాడు.
అంతేగాక ఎట్టి పరిస్థితుల్లోనూ సోనూసూద్ పాత్ర సమయం నిడివిని తగ్గించనని తానూ తెగేసి చెప్పడంతో కంగనా రనౌత్ తానే దర్శకత్వ బాధ్యతలు తీసుకొని తనకు నచ్చినట్లుగా మళ్లీ రీ షూట్ చేస్తానని చెప్పిందని దాంతో అప్పటి నుంచి నేను సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపాడు.కానీ సోనూసూద్ కూడా తన పై ఉన్నటువంటి గౌరవంతో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా రీ షూట్ కి ఒప్పుకున్నాడని తెలిపాడు.
అయితే ఈ చిత్రం 2019 సంవత్సరంలో జనవరి 25వ తారీఖున విడుదల కాగా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కృష్ణ జాగర్లమూడి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “విరూపాక్ష” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. కాగా తాజాగా మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రానికి కూడా దర్శకుడిగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కానీ ఇప్పటి వరకూ ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.







