తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్24, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.44

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.54

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.11.00 మ12.20

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

ఈరోజు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు.

వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు.ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

మిథునం:

ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది.ఆలోచనలు ఆచరణలో పెడతారు.బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి.

నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం:

ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి.దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి.

తుల:

ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

వృశ్చికం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనుస్సు:

ఈరోజు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి.దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు.

వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.

దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది.

మకరం:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు.ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి.

ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

మీనం:

ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉండవు.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని విజయాలు దక్కుతాయి.

కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసరమైన గొడవలకు వెళ్లకపోవడం మంచిది.

లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.

తాజా వార్తలు