తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 7 యొక్క హోస్ట్ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా త్వరలోనే నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
టీవీ సెలబ్రెటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రెటీలు మరియు సినిమా ఇండస్ట్రీ వారు చాలా మంది ఈ సీజన్ లో సందడి చేస్తారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.తాజాగా మరో కొత్త పుకారు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఈ సీజన్ లో జంటలను బిగ్ బాస్ లోకి తీసుకోవాలనే నిర్ణయానికి తీసుకున్నారట.గతంలో సీజన్ ల్లో ఒకొక్క జంట చొప్పున తీసుకున్న బిగ్ బాస్ వారు ఇప్పుడు మాత్రం ఏకంగా మొత్తం అందరు కంటెస్టెంట్స్ ను జంటలుగా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ లో ఇప్పటి వరకు అందరు జోడీ కంటెస్టెంట్స్ ను ఇప్పటి వరకు ఏ ఒక్క సీజన్ లో కూడా తీసుకోలేదు.మొదటి సారి బిగ్ బాస్ లో ఇలాంటి కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు.ఇదో కొత్త తరహా బిగ్ బాస్ గా అంతా ఫీల్ అయ్యి మంచి రేటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కు సంబంధించిన అప్‌డేట్ ను త్వరలో స్టార్ మా వారు ప్రకటించిన విషయం తెల్సిందే.
జోడీ ల బిగ్ బాస్ కు మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉంది.మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది చూడాలి.తెలుగు బిగ్ బాస్ కు ఇప్పటి వరకు అన్ని సీజన్ లకు మంచి స్పందన వచ్చింది.జోడీ లతో బిగ్ బాస్ సీజన్ వస్తే కచ్చితంగా సంచలనమే అవుతుంది.







