మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పరిచయం అవసరం లేని పేరు.ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తో రామ్ చరణ్ అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రెజెంట్ రామ్ చరణ్ భారీ లైనప్ ను సెట్ చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ రెడీ చేస్తున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ అతి త్వరలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లారు.
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్ గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.
ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది.

ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా ఈ సినిమా లోని నాటు నాటు సాంగ్ నిలిచింది.ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కోసం చరణ్ న్యూయార్క్ చేరుకున్నారు.శుక్రవారం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలోని ప్రేజెంటర్స్ లో చరణ్ ఒకరిగా వ్యవహరించ నున్నారు.
అంతేకాదు అమెరికా ఫేమస్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కూడా ఈయన ప్రెజెన్స్ ఉండనుంది.

మరి ఈ సందర్భంగా న్యూయార్క్ లోని ఫ్యాన్స్ ను కలిసి చరణ్ వారితో సూపర్ సెల్ఫీ దిగాడు.ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.న్యూయార్క్ లో కూడా మెగా హీరోకు అంతే అభిమానం దక్కింది.
దీంతో చరణ్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం అవుతుంది.ఇదిలా ఉండగా ప్రెజెంట్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.







