తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ఈ వారం కూడా నిరాశ పర్చింది.బ్యాటరీ రీఛార్జ్ పేరుతో ఈ వారం కంటెస్టెంట్స్ ని ఎమోషన్స్ తో ఆడుకున్నాడు బిగ్ బాస్.
ఈ వారంలో మూడు రోజులు ఇదే జరిగింది.పూర్తిగా ఎమోషన్స్ పై ఈ వారం ఎపిసోడ్స్ ఆధారపడి నడిచాయి.
గత ఎపిసోడ్స్ తో పోలిస్తే ఈ ఎపిసోడ్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే బిగ్ బాస్ కి రేటింగ్ చాలా తక్కువగా వస్తుంది.
ఇలాంటి సమయం లో ఇలాంటి డల్ కాన్సెప్ట్స్ తీసుకు రావడం ద్వారా ప్రేక్షకులు బిగ్బాస్ కి మరింతగా దూరమవుతారు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రేటింగ్ తక్కువ వస్తుంది, అయినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు పట్టించుకోకుండా ఇలా అనాలోచితమయిన టాస్కులు ఇవ్వడం తో మరింతగా రేటింగ్ తగ్గే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం లో ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే కచ్చితం గా రేటింగ్ మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.బ్యాటరీ రీఛార్జ్ లో గెలిచిన వారికి కెప్టెన్సీ కంటెండర్ గా ఛాన్స్ ఇస్తామని మొదట చెప్పారు.
కానీ ప్రతి ఒక్కరికి కూడా కెప్టెన్సీ పోటీ పడే అవకాశం బిగ్ బాస్ ఆ తర్వాత ఇవ్వడం జరిగింది.బ్యాటరీ రీఛార్జ్ గేమ్ పెట్టి అది సంబంధం లేకుండానే కెప్టెన్సీ పోటీదారులుగా అందరినీ ప్రకటించడం జరిగింది.
ఆట లో ఇంట్రెస్ట్ ఉండడం లేదంటూ ప్రేక్షకులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ గా ఉండడం లేదంటూ ఈ మధ్య కాలం లో వార్తలు వస్తున్నాయి.ముందు ముందు ఇలాగే జరిగితే బిగ్ బాస్ ని తెలుగు ప్రేక్షకులు పూర్తి గా వదిలేసే అవకాశం ఉందని, అప్పుడు ఒకటి రెండు సీజన్లకే ఈ షో జెండా ఎత్తి వేయాల్సి ఉంటుందంటూ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.