తెలుగులో
బిగ్ బాస్
రియాల్టీ షో
కార్యక్రమం ఎంతగా పాపులర్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఇటీవలే ఈ బిగ్ బాస్ రియాల్టీ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుని నాలుగో సీజన్ వైపు అడుగులు వేస్తోంది.
కాగా ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ షో కి సంబంధించినటువంటి హోస్ట్ విషయంలో మాత్రం షో నిర్వాహకులు ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.దీంతో బిగ్ బాస్ నాలుగవ సీజన్ కి హోస్ట్ ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.
అయితే తాజాగా ఈ
బిగ్ బాస్ నాలుగో సీజన్
హోస్ట్ విషయంలో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి నలుగురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్
ఎన్టీఆర్
, స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్
ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో
మహేష్ బాబు
బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదట.దీంతో ఈ లిస్టులో నుంచి మహేష్ అవుట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే స్టైలిష్ స్టార్ బన్నీ కూడా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు
సుకుమార్
దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అందువల్ల అల్లు అర్జున్ బిజీగా ఉండటంతో అల్లుఅర్జున్ పేరు కూడా దాదాపుగా తొలగించినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే మూడవ సీజన్ లో
టాలీవుడ్ కింగ్ నాగార్జున
హోస్ట్ గా వ్యవహరించారు.దీంతో నెటిజన్లు బిగ్ బాస్ రియాల్టీ షోనాలుగవ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ ని హోస్ట్ గా కావాలని బిగ్ బాస్ షో నిర్వాహకులకు రిక్వెస్ట్ లు పెడుతున్నారట.దీంతో షో నిర్వాహకులు ప్రస్తుతం తారక్ డేట్లు సంపాదించే పనిలో పడినట్లు సమాచారం.
.