ప్రతి ఒక్కరి జీవితాలలో కష్టాలు అనేవి ఉంటాయి.కష్టాలు లేని జీవితం ఎవరికి ఉండదు.
ఇక కష్టాలు ఉంటే వాటిని తట్టుకోలేక చనిపోవడమే మార్గం అంటే అది సరైనది కాదు.ఒకవేళ అదే మార్గం అంటే ఈపాటికి భూమి మొత్తం స్మశానాలుగా మారేది.
కానీ తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లలంతా ప్రతి ఒక్క చిన్న కష్టాన్ని తట్టుకోలేక సూసైడ్ మార్గం అనుకొని సూసైడ్ చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.
ఇప్పుడు అటువంటి ఘటనే ఓ దగ్గర చోటు చేసుకుంది.
ఇక ఆ విషయాన్ని నటి రేఖా భోజ్ తెలిపింది.పైగా అయితే 100 సార్లు చనిపోయి ఉండాలి అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.
ఇంతకు అసలు విషయం ఏంటి.చనిపోయిన అమ్మాయికి రేఖా కు సంబంధం ఏంటో తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి రేఖా భోజ్. తెలుగులో చిన్న చిన్న సినిమాలలో నటించింది.రంగీలా, దామిని విల్లా వంటి పలు సినిమాలలో నటించి తన నటనకు కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఈమెకు మాత్రం తెలుగులో అంతగా అవకాశాలు లేకుండా పోయాయి.
కేవలం నటిగానే కాకుండా డాన్సర్ కూడా.మొదలైన ప్రతి ఒక్క పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టి బాగా సందడి చేస్తుంది.
గతంలో ఈమె సినీ మేకర్స్ పై సంచల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు చోటు లేదు.ఇతర భాషలకు చెందిన హీరోయిన్ లను తీసుకొని వాళ్లకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు.కానీ తెలుగు హీరోయిన్లను మాత్రం కనీసం దరి చేరనివ్వట్లేదు.దీంతో చాలామంది తెలుగు హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమపై ఎన్నో వ్యాఖ్యలు చేశారు.
ఇక అందులో రేఖా కూడా ఒకరు.
తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరంటూ.అదే ఇతర ఇండస్ట్రీలో తమ భాషలకు చెందిన హీరోయిన్లను తీసుకొని ప్రోత్సహిస్తున్నారు అంటూ గతంలో వ్యాఖ్యలు చేసింది.
అలా ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది.అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.
ఇంతకు అదేంటంటే తనతో పాటు కలిసి కవర్ సాంగ్ చేసిన జ్యోత్స్న అనే అమ్మాయి ఇటీవలే ప్రేమ సమస్య వల్ల సూసైడ్ చేసుకుంది.ఇక ఈ విషయాన్ని రేఖా తెలుపుతూ.జోత్స్న.నాతో సామి సామి కవర్స్ సాంగ్ చేసిన టెన్త్ క్లాస్ అమ్మాయి.ఇప్పుడు ఆమె ఇంటర్ ఫస్టియర్.నిన్న ఆమె సూసైడ్ చేసుకుంది.
లవ్ సమస్య.
చనిపోవడమే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే.
నేను ఇప్పటికీ ఒక వంద సార్లు చనిపోయి ఉండాలి.పేరెంట్ పోలీసులకు చాలా గట్టిగా ఉండాల్సిన రోజులు ఇవి.ఇది అమ్మాయి కైనా, అబ్బాయి కైనా.వాళ్ళు ఫీలయిన సరే.వెన్నంటే ఉండి ఈ భయంకరమైన, వికృతమైన ఆలోచనలు ఉన్న ఈ సమాజం నుంచి పిల్లలను కాపాడుకోవాలి అని తెలిపింది.అయితే ఆమె చేసిన ఈ కామెంట్ లో చనిపోవడమే పరిష్కారం అనుకుంటే తను ఇప్పటికి వంద సార్లు చనిపోయి ఉండాలి అని తెలిపింది.
అంటే ఆమె ఇప్పటికీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లుగా తెలిపింది.