సీరియల్( Serial ) అంటేనే రెండు గంటల్లో అయిపోయే సినిమా లాగా కాదు వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిన కొద్దీ దాంట్లో ఎలాంటి ఉత్కంఠ కూడా మిస్ అవ్వకుండా కొనసాగిస్తూ ఉండాలి.అభిమానుల ఆసక్తి ఉంటే తప్ప సీరియల్ టిఆర్పి రేటింగ్ తో ముందుకు వెళ్లదు అలా ఒక్కసారి అభిమానం దక్కించుకున్న సీరియల్ తో పాటు ఆ సీరియల్ లో నటించే హీరోయిన్స్ కి కూడా మంచి గుర్తింపు వస్తుంది.
వారు ఉంటే చాలు ఆ సీరియల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే విధంగా కొనసాగుతూ ఉంటుంది.మరి ఈ ప్రస్తుతానికి బుల్లితెరపై రాణిస్తున్న ఆ ఐదు సీరియల్ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దీప్తి మన్నే

రాధమ్మ కూతురు( Radhamma Kuthuru )లో అక్షర గా, జగధాత్రి లో టైటిల్ రోల్ పోషిస్తున్న దీప్తి ప్రస్తుతం టాలీవుడ్ లోనే బెస్ట్ యాక్టర్స్ గా దూసుకుపోతుంది.రాధమ్మ కూతురు జీ తెలుగులో ప్రసారమవుతూ మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకోవడంతో ఆమెనే మరోసారి హీరోయిన్ గా తీసుకొని ఈ జీవారు జగదాత్రి అనే సీరియల్ తో ముందుకు వస్తున్నారు.ప్రస్తుతం బుల్లితెరపై ఈమె నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు.
మేఘన లోకేష్

శశిరేఖా పరిణయం( Shashirekha Parinayam )తో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టింది మేఘన లోకేష్ ఆ తర్వాత ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.అప్పటినుంచి ఇప్పటివరకు మేఘన సీరియల్ ఇండస్ట్రీలో దూసుకుపోతూనే ఉంది.
ఐశ్వర్య పిస్సే

అగ్నిసాక్షి సీరియల్ ద్వారా మొట్టమొదటగా సీరియల్ ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషల్లో కూడా అనేక సీరియల్స్ లో నటిస్తూ వస్తోంది.ఆమె ప్రస్తుతం జీ తెలుగులో ఒక సీరియల్ లో నటిస్తూ ది బెస్ట్ టెలివిజన్ స్టార్ గా మారిపోయింది.
వర్షా

ప్రేమ ఎంత మధురం( Prema Entha Madhruam ) అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది వర్ష నటిస్తున్న ఒక్క సీరియల్ తోనే ఆమె టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా అభిమానుల్లో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది.ప్రస్తుతం ఈ సీరియల్ కూడా జీ తెలుగులో నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతుంది.
అషిక పడుకొనే

జీలో ప్రసారమవుతున్న మరొక అద్భుతమైన సీరియల్ త్రినయని( Trinayani ).ఈ సీరియల్ లో అశిక పడుకునే హీరోయిన్గా నటిస్తుంది అంతకన్నా ముందే కొన్ని సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెరపై టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది.







