తెలంగాణ: రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వ‌ద్దిరాజు ర‌విచంద్ర

తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర గారు నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా అభ్యర్ధి వ‌ద్దిరాజు ర‌విచంద్రకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

తాజా వార్తలు