చంద్రబాబు ఖమ్మం పర్యటనకు పోటెత్తిన తెలంగాణ టీడీపీ కార్యకర్తలు..!!

తెలంగాణలో చాలాకాలం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ తరఫున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.“టీడీపీ శంఖారావం” పేరిట సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదు నుండి భారీ కాన్వాయ్ తో ఖమ్మం బయలుదేరారు.ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దు లలో చంద్రబాబుకి టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

 Telangana Tdp Workers Flocked To Chandrababu Visit To Khammam, Tdp, Kasani Gnane-TeluguStop.com

చంద్రబాబు కాన్వాయ్ గుండా వందల సంఖ్యల వాహనాలతో తెలంగాణ టీడీపీ కార్యకర్తలు బయలుదేరడం జరిగింది.చాలాకాలం తర్వాత తెలంగాణలో చంద్రబాబు ఎంట్రీతో టీడీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది.

 చంద్రబాబు రాకతో తెలంగాణ టిడిపి మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు తాజా వాతావరణం కనిపిస్తుంది.కాసాని జ్ఞానేశ్వర్ నీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత తొలి భారీ బహిరంగ సభ కావడంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

దీంతో ఇప్పుడు ఖమ్మం మొత్తం పసుపు మయం అయింది.సర్దార్ పటేల్ స్టేడియంకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తూ ఉండటంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube