తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నా రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ నుండి తప్పుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణలో పోటీ విషయంలో టీడీపీ( tdp ) అధిష్టానం తీసుకున్న నిర్ణయం పై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar )పార్టీకి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు.తెలంగాణలో పోటీ చేద్దామని ముందు ప్రకటించి.
తర్వాత పోటి నుండి విరమించుకోవడంతో కాసాని రాజీనామా చేశారు.
తెలంగాణలో 20 సీట్లకు పైగా గెలిచే అవకాశం ఉన్న… పోటీకి నిరాకరించడం బాధ కలిగించింది.
కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి కుట్రలు కూడా చేశారు.చంద్రబాబు ( Chandrababu )శిష్యుడైన రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు ఏపీ టీడీపీ నాయకులు బలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేల కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కాసాని స్పష్టం చేశారు.







