తెలంగాణలో పోలీస్ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.ఈ క్రమంలో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు చేస్తూ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన చేసింది.
మార్చి 12 నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరగనుండగా… ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందని అధికారులు తెలిపారు.ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి హాల్ టికెట్లను ఎప్పటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.