నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
దసరా తర్వాత నాని మరోసారి కొత్త దర్శకుడితో రిస్క్ చేస్తున్నాడు.మైత్రి నిర్మాతల్లో ఒకరైన సివి మోహన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరేక్కుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ ఎనౌన్స్ మెంట్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.ఈ సినిమాలో నాని సరసన సీతామహాలక్ష్మి అదేనండి మృణాల్ ఠాకూర్ నటిస్తుందని తెలుస్తుంది.
దసరా తర్వాత తన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండాలని ఫిక్స్ అయిన నాని తన 30వ సినిమా కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ని తీసుకోవడం పై నాని స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది.
నాని చెప్పాడనే మృణాల్ ని తీసుకున్నట్టు టాక్.మృణాల్ ఎంపిక కంప్లీట్ గా నాని ఇంట్రెస్ట్ అని అంటున్నారు.
సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు మృణాల్ అయితే న్యాయం చేస్తుందని నాని చెప్పగా ఆమెని తీసుకున్నారట.సీతారామం తర్వాత మృణాల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే అవడం విశేషం.
మృణాల్ ఠాకూర్ కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.సో నాని సినిమాకు ఆమె ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.