Telangana : కాంగ్రెస్ కు షాకేనా..ఎంపీ ఎలక్షన్స్ కు బిజెపి సరికొత్త ప్లాన్..!

తెలంగాణ ( Telangana ) రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు వచ్చింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ముందుకు వెళ్తోంది.

ఇదే తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్, బిజెపి రాబోవు ఎన్నికలపై దృష్టి పెట్టింది.

Telangana Shock To Congress Bjps New Plan For Mp Elections

ముఖ్యంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కు దీటుగా సత్తా చాటాలని ఎవరి ప్లాన్ లో వారు ఉన్నారు.ఈ క్రమంలోనే బిజెపి ( BJP ) పార్టీ మాత్రం ఒక కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.ఆ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది.

ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టింది.

Advertisement
Telangana Shock To Congress Bjps New Plan For Mp Elections-Telangana : కా�

నాలుగు సీట్లున్నటువంటి అసెంబ్లీ సీట్లను 8 సీట్లకు పెంచుకుంది.అంటే తెలంగాణలో బిజెపి కాస్త పుంజుకుంది అని చెప్పవచ్చు.

ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి బిజెపి హై కమాండ్ లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది.

Telangana Shock To Congress Bjps New Plan For Mp Elections

ఈసారి లోక్ సభలోకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్( Etela Rajender) , ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులతోపాటు మరి కొంతమంది స్టేట్ లీడర్లను బరిలోకి దింపనుంది.అంతేకాకుండా ఈసారి తెలంగాణలో వారి అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించుకొని , అన్ని రకాల ప్లాన్ లతో ముందస్తుగానే ఎన్నికల బరిలోకి వెళ్లాలని చూస్తోంది.అయితే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమిపాలైనటువంటి కొంతమంది అభ్యర్థులు తప్పకుండా ఎంపీ ఎలక్షన్స్ లో విజయం సాధిస్తారని ధీమాతో ఉంది.

కాబట్టి కాంగ్రెస్ ( Congress) కు దీటుగా లోక్ సభ అభ్యర్థులను పెట్టి గెలుపు సాధించాలనే ఆలోచనతో బిజెపి పావులు కలుపుతున్నట్టు సమాచారం.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు