ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ( BRS )మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో అనేక ప్రయత్నాలు చేసింది.అయితే జనాలు మాత్రం మూడోసారి బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టేందుకు ఇష్టపడ లేదు.
ఫలితంగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.ఊహించిన విధంగా బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించిన బీఆర్ఎస్ హవా క్రమ క్రమంగా తగ్గుతుంది .ఇక హుజూర్ నగర్ , దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలైంది.2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే క్రమక్రమంగా బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి గతంలో మాదిరిగా కెసిఆర్ ( KCR )ను ప్రజలు అంతగా పట్టించుకోకపోవడానికి కారణలు చాలానే ఉన్నాయి.
కెసిఆర్ ( KCR )పెద్దగా జనాల్లోకి రారు. అప్పుడప్పుడు మాత్రమే కీలకమైన సభలకు హాజరవుతూ ఉంటారు.ఇక పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు పెద్దగా అందుబాటులో ఉండరు.ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారు.
దీంతో పార్టీ ప్రభుత్వ బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ తో పాటు, మరో మంత్రి హరీష్ రావు, కుమార్తె ఎమ్మెల్సీ కవిత వంటి వారే చూసుకుంటూ ఉంటారు.కెసిఆర్ ప్రజల్లో తిరగకపోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అందుబాటులో ఉండకపోవడం ఇవన్నీ బీ ఆర్ ఎస్ కు ఇబ్బంది తీసుకువచ్చాయి.
తెలంగాణలో నిరుద్యోగం పెరగడం, ఉద్యోగ నోటిఫికేషన్ లు పెద్దగా లేకపోవడం పోవడం , ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు రాకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ పై వారిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవడం ఇవన్నీ టిఆర్ఎస్ ఓటమిలో భాగస్వామ్యం అయ్యాయి.

అయితే అక్కడ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలోనూ కనిపించే అవకాశం లేకపోలేదు.ఏపీలో మరుకొద్ది నెలల్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది.అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కు ప్రజల్లో ఏ ఏ విషయాల్లో వ్యతిరేకతమయిందో అవే ఏపీలోనూ చోటు చేసుకుంటుండడం వంటివన్నీ జగన్ ( CM Jagan )ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలోను సరైన సమయంలో జీతాలు రాకపోవడం తో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరగడం, ఎక్కువగా సంక్షేమ పథకాలపై సొమ్ములు ఖర్చు పెడుతూ మిగతా రంగాలను పట్టించుకోవడం లేదు అనే ప్రచారం జనాల్లోకి వెళ్లడం వంటివన్నీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని అంతా అంచనా వేస్తున్నారు.

ఇక ఏపీలో మీడియా ఎక్కువగా టిడిపికి( TDP ) అనుకూలంగా ఉండడం, ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు జనాలకు అందుతున్నా, అభివృద్ధి జరగడంలేదని, పరిశ్రమలు రావడంలేదని , ఉపాధి అవకాశాలు దొరక్క వలసలు పెరగడం, ఇవన్నీ ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు .అంతే కాకుండా జగన్ సైతం ఎక్కువగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంకే పరిమితం అయ్యి జనాల్లో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఇవన్నీ కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఇకనైనా తెలంగాణ ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకుని జగన్ తను వైఖరిని మార్చుకుని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టుగలిగితేనే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.







