నంద్యాల జిల్లా నందికొట్కూరు( Nandikotkur ) మండలం అల్లూరులో హైడ్రామా జరిగింది.టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ శివానంద రెడ్డి( Shivananda Reddy ) నివాసానికి తెలంగాణ పోలీసులు చేరుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.
భూ వివాదం కేసులో( Land Dispute Case ) శివానంద రెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ( Hyderabad CCS Police ) ఆయన ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.కేసులో భాగంగా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నట్లు తెలపడంతో.
నోటీసు ఇవ్వాలని శివానంద రెడ్డి కోరారు.
తరువాత అరెస్ట్ వారెంట్ చూపాలని పోలీసులను కోరారు.
ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇచ్చిందుకు రెడీ చేస్తున్న సమయంలో శివానంద రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.దీంతో ఆయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని సమాచారం.
అయితే దీనిపై శివానంద రెడ్డి మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్లలేదని, పోలీసులు నోటీసులు ఇస్తే విచారణకు సహకరిస్తానని తెలిపారు.