తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు పెను ప్రమాదం తప్పింది.కరీంనగర్ జిల్లాలోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో మంత్రితో సహా ఇతర నేతలు కిందపడిపోయారు.
ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది.అయితే పరిమితికి మించి ఎక్కడంతో సభా వేదిక కూలినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో స్వల్ప గాయాలు కావడంతో వైద్యులు ప్రాథమిక చికత్స అందించారని మంత్రి తెలిపారు.ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.







