ఢిల్లీలో తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక మంతనాలు

ఢిల్లీ వేదికగా తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక మంతనాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ఇంటి వద్ద ఆశావహులు క్యూ కట్టారు.

 Telangana Kamma Political Forum Discussions In Delhi-TeluguStop.com

మాజీ మంత్రి రేణుకాచౌదరి నేతృత్వంలో కమ్మ సామాజిక వర్గ నేతలు మురళీధరన్ తో కీలక సమావేశం నిర్వహించారు.టికెట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నిన్న కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కలిసిన కమ్మ నేతలు ఇవాళ మురళీధరన్ తో భేటీ అయ్యారు.తమ వినతులను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని రేణుక చౌదరి తెలిపారు.

ఈ నేపథ్యంలో మరో రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటామన్న ఆమె అవసరం అయితే ప్లాన్-బి ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube