టీచర్ల బదిలీల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్టే పొడిగించింది.ఈ మేరకు ఈనెల 11వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు అవకాశం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు.ఈ క్రమంలో విచారణ పూర్తయ్యాకే బదిలీలు చేయాలని చీఫ్ జస్టిస్ వెల్లడించారు.30 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసిన టీచర్లు ఉన్నారని తెలిపింది న్యాయస్థానం.బదిలీలలో స్పౌజ్ లకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంపై నాన్ స్పౌజ్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్టేను పొడిగించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 11 వ తేదీకి వాయిదా వేసింది.







