పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి.ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించడం అంటే తేలికైన విషయం కాదనే సంగతి తెలిసిందే.
ఒకప్పుడు హోటల్ లో వెయిటర్ గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన జయ గణేష్( Jaya ganesh )అనే వ్యక్తి కన్న కలలను నెరవేర్చుకున్నారు.
ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పవచ్చు.కృషి, పట్టుదలతో జయ గణేష్ తన లక్ష్యాన్ని సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
తమిళనాడు రాష్ట్రంలోని కుగ్రామంలో జన్మించిన జయ గణేష్ బాల్యం నుంచి చదువులో ముందువరసలో ఉండేవారు.
పది, ఇంటర్ లో అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకున్న జయ గణేష్ బీటెక్ లో మెకానికల్ ఇంజరీంగ్ తీసుకున్నారు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో చిన్న ఉద్యోగంలో చేరారు.25,000 వేతనం వస్తున్నా కుటుంబ ఖర్చులకు ఆ మొత్తం సరిపోయేది కాదు.ఆ తర్వాత సివిల్స్ పై దృష్టి పెట్టిన జయ గణేష్ ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకోవడానికి వెయిటర్ గా కూడా పని చేశారు.
ఆ తర్వాత సివిల్స్ పరీక్షలకు ( Civil Services Exam )హాజరైన జయ గణేష్ కు ఆరుసార్లు షాక్ తగిలినా పట్టు వదలకుండా ఏడోసారి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.156వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు.తన కష్టమే జయ గణేష్ ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా జయ గణేష్ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉండటం గమనార్హం.