తెలంగాణ రాష్ట్ర హైకోర్టు( Telangana High Court ) సంచలమైన తీర్పు ఇచ్చింది.కొత్తగూడెంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ తీర్పు బయట పెట్టింది.
ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని అన్నది.ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును( Jalagam Venkatrao ) ప్రకటిస్తూ కోర్టు తీర్పును బయటపెట్టేసింది.
అయితే ఎన్నికల సమయంలో వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateshwar Rao) తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్టు నిర్ధారించినటువంటి తెలంగాణ హైకోర్టు రూ:5 లక్షల జరిమానాతో పాటు, ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ ప్రకటన జారీ చేసింది.ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఎన్నికల అధికారులకు చూపించినది అబద్ధమని , 2018లో కాంగ్రెస్(congress) పార్టీ తరపున గెలిచిన వనమ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫునుంచి పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు(Jalagam Venkatrao).వనమ వెంకటేశ్వరరావు అఫీడవిట్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించినటువంటి హైకోర్టు(high court) ఈసీకి తప్పుడు సమాచారం అందించినందుకు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని చెబుతూ తీర్పు ఇచ్చింది.ఈ తరుణంలో సెకండ్ ప్లేస్ లో నిలిచినటువంటి జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అంటూ ధర్మాసనం అసలు విషయాన్ని బయట పెట్టేసింది.అయితే ఆ ఎన్నికల్లో వనమాకు దాదాపుగా 81 వేల ఓట్లు రాగా , జలగం వెంకట్రావుకు దాదాపు 77వేల ఓట్లు వచ్చాయి.
ఇంకో నాలుగు, ఐదు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ తీర్పు వెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎన్నికలు జరిగి నాలుగు సంవత్సరాల పైన కాలం గడిచిన తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును బయట పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది.దీంతో వనమ వెంకటేశ్వరరావు పై( Venkateshwar Rao) అనర్హత వేటు వేసిన హైకోర్టు, ఆయన ఎన్నికను రద్దు చేసింది.
దీంతో చాలామంది నెటిజన్లు ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చి ఏం లాభం అంటూ కామెంట్లు పెడుతున్నారు.