సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో కలిసి నటిస్తే వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తుంటాయి.బాలయ్య విజయశాంతి( Balayya ,Vijayashanti ) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
బాలయ్య విజయశాంతి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు గతంలో ప్రచారంలోకి రాగా ఆ వార్తల గురించి క్లారిటీ రాలేదు.
ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు( Famous journalist Imandi Rama Rao ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక హీరో, హీరోయిన్ కలిసిమెలిసి ఉంటే మన మీడియా కథనాలు సృష్టిస్తుందని ఆయన తెలిపారు.విజయశాంతి భర్త నన్ను అత్యంత ఆత్మీయంగా చూసేవారని ఇమంది రామారావు వెల్లడించారు.
విజయశాంతి గారి ఆత్మకథ రాయడం కోసం నేను పని చేశానని ఆయన కామెంట్లు చేశారు.
బాలయ్యతో విజయశాంతికి సత్సంబంధాలే కానీ ఎఫైర్లు లేవని ఇమంది రామారావు అన్నారు.అటు బాలయ్య, ఇటు విజయశాంతి భోళా మనుషులని ఆయన వెల్లడించారు.బాలయ్య, విజయశాంతిలకు ఒకరిపై ఒకరికి అభిమానం ఉందని ఇమంది రామారావు అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ సైతం విజయశాంతిని ఎంతో గౌరవించేవారని ఆయన కామెంట్లు చేశారు.విజయశాంతి తన పెళ్లి విషయాన్ని ఆలస్యంగా వెల్లడించారని ఇమంది రామారావు అన్నారు.
విజయశాంతి భర్త సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర బంధువు అని ఇమంది రామారావు వెల్లడించారు.తెలంగాణ కోసం విజయశాంతి ఎంతో కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు.అద్వానీ ఉన్న సమయంలో విజయశాంతికి మంచి ప్రాధాన్యత దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య విజయశాంతి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఇమంది రామారావు స్పష్టం చేశారు.ఇకనైనా ఈ తరహా వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.బాలయ్య భగవంత్ కేసరి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.