ఐటీ గ్రిడ్ వ్యవహారంలో సిట్ వేసిన తెలంగాణ ప్రభుత్వం!

ఐటీ గ్రిడ్స్ సంస్థ ఏపీ ప్రజల డేటా చోరీ చేసి ఓట్ల తొలగింపుకి ప్రయత్నం చేస్తుందని, వ్యక్తిగత డేటాని ఓ పార్టీకి అనుకూలంగా వాడుతున్నారని తెలంగాణలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసుపై విచారణ మొదలెట్టి ఐటీ గ్రిడ్స్ మోసాలని బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు వీటిలో మరిన్ని నిజాలు వెలికితీసేందుకు సిట్ విచారణకి ఆదేశించింది.

 Telangana Government Sit Inquiry On It Grid Data Thefting Cases-TeluguStop.com

రెండు కమిషనరేట్స్ పరిధిలో నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో విచారణకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

ఇక ఐటీ గ్రిడ్స్ కేసులపై విచారణకి సిట్ విచారణకి తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ సిట్ విచారణ చేస్తుందని తెలుస్తుంది.ఈ సిట్ బృందంలో డీఎస్పీలు, సిఐలు ఉంటారని తెలుస్తుంది.ఇక ఈ సిట్ బృందానికి డీజీపీ ఆఫీస్ లో ప్రత్యేక చాంబర్ కేటాయించినట్లు తెలుస్తుంది.సిట్ విచారణ అయితే కేసుని వేగవంతంగా పరిష్కరించవచ్చనే భావనతోనే తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube