తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం..!

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను( Government Advisors) నియమించింది.

వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర్ వేణుగోపాల్ ను సలహాదారులు (Advisors) గా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా సీనియర్ నేత మల్లు రవిని నియమించారని తెలుస్తోంది.

కాగా వీరిలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకం అయ్యారు.అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ., ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కర వేణుగోపాల రావును ప్రభుత్వం నియమించింది.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న సోమేశ్ కుమార్, అనురాగ్ శర్మ, ఆర్ శోభ, చెన్నమనేని రమేశ్, ఏకే ఖాన్, రాజీవ్ శర్మ, జీఆర్ రెడ్డి నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రద్దు చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు