వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల ఓనర్లకు అగ్నిమాపక శాఖ షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకోనుంది.ఇక నుండి ఆయా బిల్డింగ్లకు ఇచ్చే ఎన్వోసీని ఏడాదికే పరిమితం చేయనుంది.
సికింద్రాబాద్ లోని రూబీ ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.గతంలో ఐదు సంవత్సరాలకు ఓసారి ఎన్వోసీని ఇచ్చేవారు.
నిబంధన మార్చడంతో బిల్డింగ్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.