బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్‌కి చాలా మంది యువత ఫ్యాన్స్ అయిపోయారు.కాగా భద్రతా సమస్యల కారణంగా దీన్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.
దాంతో చాలామంది నిరాశలో మునిగితేలుతున్నారు.అప్పుడు పబ్జీ బ్యాన్ కావడంతో ఎంతగా బాధపడ్డారో ఇప్పుడు కూడా వారు అదేస్థాయిలో బాధపడుతున్నారు.
మళ్లీ ఇండియాలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బీజీఎంఐ ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ అందింది.
అదేంటంటే, ఈ గేమ్ త్వరలోనే భారత్‌లో రీ-లాంచ్ కానుంది.ఈ గేమ్‌పై బ్యాన్ త్వరలోనే ఎత్తివేసే అవకాశం ఉందని.
అప్పుడు ఇది మళ్లీ భారత్‌లో ఎంట్రీ ఇస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
భారతదేశంలో టెక్నికల్ గురూజీగా పాపులర్ అయిన ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ చౌదరి తాజాగా మాట్లాడుతూ 2022, డిసెంబర్ నాటికి బీజీఎంఐ తిరిగి ఇండియాలో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.
మిగతా టెక్ ఎక్స్‌పర్ట్స్ కూడా బీజీఎంఐ కం బ్యాక్ ఇస్తుందని పేర్కొన్నారు.కొత్త ఇండియన్ పబ్లిషర్ కంపెనీ దీన్ని తీసుకురావచ్చని మరి కొందరు పేర్కొంటున్నారు.అలానే ఈ గేమ్ పేరు మారిపోతుందని అంటున్నారు.2022లో ఈ గేమ్ రాకపోయినా 2023 వేసవికాలం లోపు కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని ఒక టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

గేమ్ కమ్ బ్యాక్ సంబంధించి దాని మాతృసంస్థ క్రాఫ్టన్ ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.భారత ప్రభుత్వం ఈ విషయం గురించి గోప్యంగా ఉంచాలని ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.అందుకే, అభిమానులు మరింత క్లారిటీ కోసం కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.







