జాక్ మరియు రోజ్‌ల ప్రేమగాథ అనగానే అందరికీ టైటానిక్ సినిమా గుర్తు వస్తుంది.ప్రేమ కథ నిజం కాకపోయినా, టైటానిక్ మాత్రం సముద్రంలో మునిగిపోయిన పెద్ద నౌకగా చరిత్రలో స్థానం ఉంది.
ఇది ఆ కాలంలోని అతిపెద్ద ఓడలలో ఒకటి.దానికి టిక్కెట్టు అనేది ధనవంతులు, ప్రముఖులు మాత్రమే కొనగలిగేలా ఉండేది.
ఇది ఏప్రిల్ 10, 1912 న తన మొదటి సముద్రయానం కోసం బయలుదేరింది.కానీ అది మంచుకొండను ఢీకొని మునిగిపోయింది.
ఏప్రిల్ 15, 1912న ఉత్తర అట్లాంటిక్‌లోని సముద్ర జలాల్లో సమాధి అయింది.ప్రస్తుతం చర్చనీయాంశమైన విషయం ఏంటంటే మీరు ఆ మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూడొచ్చు.ఇందు కోసం ఎక్స్‌పెడిషన్ కంపెనీ (ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్) సాయంతో సముద్ర గర్భంలోకి టూర్‌కి వెళ్లి రావొచ్చు.3 గంటల పాటు ఈ టూర్ ఉంటుంది.దీనికి ఖర్చు అయ్యే టికెట్ ధర అక్షరాలా రూ.90,57,950.లోపలికి వెళ్లిన తర్వాత టైటానిక్‌ని ఆసాంతం చూసి రావొచ్చు.
ఈ ఏడాది మే నుండి సెప్టెంబరు మధ్య ఆరు సాహసయాత్రలను ఎక్స్‌పెడిషన్ కంపెనీ ప్రకటించింది.అవి విజయవంతం కావడంతో ఆ సాహసయాత్రలను కొనసాగిస్తోంది.టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం ఈ అన్వేషణ యాత్ర లక్ష్యం.
యాత్రలో భాగమయ్యే అవకాశం కోసం ఆన్‌లైన్‌లో వారి ఆసక్తిని పంపవచ్చు.యాత్రకు వెళ్లే ముందు మిమ్మల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేస్తారు.
టైటానిక్ శిధిలాలు 1985లో కనుగొనబడ్డాయి.

ఆ సమయంలో, టైటానిక్ అత్యంత విలాసవంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఓడలలో ఒకటి.ఇందులో 16 వాటర్‌టైట్ కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.ఇది ప్రమాద సందర్భంలో తేలుతూ ఉండటానికి సహాయపడుతుంది.
ప్రమాద తీవ్రత వల్ల దాని కంపార్ట్‌మెంట్లు అన్నీ దెబ్బతిన్నాయి.ఓడ 1500 మంది ప్రయాణికులతో మునిగిపోయింది.
అందులోని 706 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ప్రమాదం ఎప్పటికప్పుడు అతిపెద్ద విషాదాలలో ఒకటి.
దీనిపై వచ్చిన టైటానిక్ సినిమా చూసిన తర్వాత దాని గురించి ఎక్కువ మందికి తెలిసింది.







