వచ్చే నెల 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.రాష్ట్రంలో ఈసారి అధికారం కోసం బిఆర్‌ఎస్ ( BRS PARTY )తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి.
అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే బీజేపీకి కీలకంగా మారాయి.ఎందుకంటే సౌత్ లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి దారుణంగా పడిపోయింది.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తెలంగాణ.ఇలా ఏ రాష్ట్రం చూసిన.
బీజేపీ అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కనిపించాదు.మొన్నటి వరకు చేతిలో ఉన్న కర్నాటక సైతం చేజారిపోయింది.
దాంతో బీజేపీ ఉనికి నిలుపుకోవాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి.మరి రాష్ట్రంలో బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే సమాధానం దొరకం కస్టమే.విజయం మాదే అని కమలనాథులు చెబుతున్నప్పటికి.అది అంతా తేలిక కాదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే.అధికార బిఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ ఎంతో కొంత బలంగా ఉంది.ఈ రెండు పార్టీలను దాటుకొని బీజేపీ అధికారం సాధించడం ఆసాద్యమని కొందరి వాదన.
పైగా పార్టీలో గత కొన్నాళ్లుగా అంతర్గత కుమ్ములాటలు మరి ఇబ్బంది పెడుతున్నాయి.
పార్టీలో సీనియర్ నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అందుకే సీట్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు తుది నిర్ణయానికి రాలేక పోతున్నారట.గత కొన్నాళ్లుగా సీట్ల పంపకాలపై కుస్తీలు పడుతున్నప్పటికి ఫైనల్ లిస్ట్ రెడీ చేయడం కమలనాథులకు అగ్నిపరీక్షగా మారింది.
జాతీయ నేతలు రాష్టంలో వరుస పర్యటనలు చేస్తూ పార్టీలో కొత్త ఊపు తీసుకోస్తున్నప్పటికి ప్రజల్లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదనేది ఇంటర్నల్ గా నడుస్తున్న చర్చ.దాంతో తెలంగాణ ఎన్నికలపై బీజేపీ కొంత డైలమాలోనే ఉందట.
అధికారమే లక్ష్యంగా ఉన్న బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టిన దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ కనుమరుగవ్వడం ఖాయమనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోందట.మరి ఇన్ని ప్రతికూల పరిస్థితులను దాటుకొని బీజేపీ విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.