తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ రేపు ఎన్నికల కార్యాచరణను ప్రకటించనుంది.
ఈ మేరకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు.రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో సమావేశం జరగనుందని తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం షర్మిల ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నారు.కాగా పాలేరుతో పాటు మిర్యాలగూడలోనూ పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనున్నారు.ఈ క్రమంలోనే ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకోనున్నారని సమాచారం.
అదేవిధంగా త్వరలోనే పాలేరులో షర్మిల పాదయాత్ర చేయనున్నారు.అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ విలీనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన షర్మిల హస్తం పార్టీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆశలు వదులుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో షర్మిల ఒంటరిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.