తెలంగాణ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 1,891 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి జోరు మెల్లిమెలిగా తగ్గుముఖం పడుతోంది.కొత్తగా నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసులతో పాటు, కరోనా మరణాలు కూడా రోజురోజుకి తగ్గుతున్నాయి.

 Kovid-19 , Corona Virus , Who , Covid-19 Vaccine, Telangana Corona Update, Tscor-TeluguStop.com

ఇక తాజాగా శుక్రవారానికి సంబంధించి కరోనా బులిటెన్ ను తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తాజాగా ప్రభుత్వం ప్రకటించిన బులిటెన్ ప్రకారం .తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో7 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ , కరోనాను ఎదుర్కోలేక ప్రాణాలు కోల్పోయారు.

అలాగే , మరో 1,878 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది.

ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు.అలాగే కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,208 కు చేరింది.

ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.ఇక , తెలంగాణలో రికవరీల సంఖ్య భారీగా పెరిగాయి.దేశ రికవరీ రేటు 85.5గా ఉండగా, తెలంగాణ రికవరీ రేటు 86.77గా ఉంటుంది.ఇక దేశంలో మరణాల రేటు 1.5శాతంగా ఉంటే, తెలంగాణలో మాత్రం 0.57 ఉంది.ఇక గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 285, రంగారెడ్డిలో 175, మేడ్చల్ మల్కాజ్ గిరి 195, నల్లగొండలో 128, వరంగల్ అర్బన్లో 76, సిద్దిపేటలో 64, కరీంనగర్‌లో 97 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube