తెలంగాణలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది.కరోనా వైరస్ కేసులు ఇంకా పెద్ద ఎత్తున వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ప్రతి రోజూ కూడా దాదాపుగా రెండు వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా నేడు 1,896 కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు తెలంగాణ లో మొత్తం 2,06,644 మంది ఈ వైరస్ బారినపడినట్టు అయింది.</br>
అలాగే, నిన్న కరోనా మహమ్మారి కారణంగా 12 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,201కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది.
మహమ్మారి బారినుంచి గత 24 గంటల్లో 2,067 మంది కోలుకున్నారు.దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,79,075కు చేరుకుంది.
రాష్ట్రంలో ఇంకా 26,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.</br>
ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తం గా 50,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వీటితో కలుపుకుని ఇప్పటి వరకు 33,96,839 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో రికవరీల సంఖ్య భారీగా పెరిగాయి.దేశ రికవరీ రేటు 85.2గా ఉండగా.తెలంగాణ రికవరీ రేటు 86.65గా ఉంటుంది.ఇక దేశంలో మరణాల రేటు 1.5శాతం గా ఉంటే.తెలంగాణ లో 0.58 ఉంది.</br>
.






