Corporation Chairmans : కార్పొరేషన్ చైర్మన్ ల జాబితా సిద్ధం.. రేసులో వీరంతా ?

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ ( Congress ) సిద్ధమవుతోంది.

ముఖ్యంగా రాష్ట్రంలో 10 కార్పొరేషన్ల కు చైర్మన్ లను నియమించే విషయమై గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూనే వస్తోంది.

ఈ మేరకు పదిమంది కీలక నేతల పేర్లను ఫైనల్ చేశారు.ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు పంపించారు.

అక్కడి నుంచి దీనిపై అనుమతి రాగానే వారు జాబితాను ప్రకటించనున్నారు.ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివిధ కార్పొరేషన్ పదవుల కోసం చాలామంది కీలక నేతలు  ఆశలు పెట్టుకున్నారు .కొంతమంది ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం గట్టిగానే ప్రయత్నించినా అవకాశం దక్కని వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.ఈ నేపథ్యంలో మొదటి విడతలో భర్తీ చేసే పది కార్పొరేషన్ చైర్మన్ ల( Corporation Chairman ) జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అనే టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది .

Advertisement

వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల తరువాత కార్పొరేషన్ చైర్మన్ లను ప్రకటించాలని కాంగ్రెస్ భావించింది.కానీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన  నేతలకు మొదటి జాబితాలో కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.దీని కారణంగా అసంతృప్త నేతలకు వచ్చే ఎన్నికల్లో ఏ సమస్యలు ఉండవని అంచనా వేస్తోంది.

ప్రస్తుతం 10 కార్పొరేషన్లకు సంబంధించి ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ,( Shiva Sena Reddy ) భవాని రెడ్డి,( Bhavani Reddy )  కొనగల మహేష్ ,మల్ రెడ్డి రామ్ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ,( Anvesh Reddy ) ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం , ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్ మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి,  ఓబిసి సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ , వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య,  సామ రామ్మోహన్ రెడ్డి,  రాములు నాయక్ , మల్లాది పవన్, ఉన్న కైలాష్ నేత , లింగం యాదవ్ , కాల్వ సుజాత ,రియాజ్, రాచమల్ల సిద్దేశ్వర్ , చరణ్ కౌశిక్,  బాల లక్ష్మి వంటి వారు కార్పొరేషన్ పదవుల పై ఆశలు పెట్టుకుంటూ .తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తూ రేవంత్ రెడ్డి తో పాటు,  కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...
Advertisement

తాజా వార్తలు