తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న ఆయన ప్రధానమంత్రి మోదీతో భేటీకానున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ క్రమంలో సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.ఇందులో భాగంగా రాష్ట్ర అవసరాలను రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించనున్నారని తెలుస్తోంది.అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
అదేవిధంగా విభజన హామీలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మోదీతో ప్రస్తావించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి సీఎం, డిప్యూటీ సీఎంలు భేటీకానుండటం చర్చనీయాంశంగా మారింది.