బీజేపీ మన వేలితో మన కండ్లనే పొడుస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి చండూర్‌లో ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది శ్రమించారు.తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నో అవరోధాలు దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం వేసే ఓట్లే మన భవిష్యత్‌కు కాపాడగలుగుతాయి.
మనం జాగ్రత్తగా ఓటు వేయకపోతే కేంద్ర పెట్టుబడి దారులకు మనమే దారి ఇచ్చినట్లు అవుతుంది.మనమే మన చేతులతో ప్రైవేటీకరణకు పునాది వేసినట్లు అవుతుంది.
పండ్ల మొక్కలను నాటితేనే చెట్టుగా మారి.పండ్లను ఇస్తుంది.గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే పాలు రావని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రజలు ఆలోచించాలి.

దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి చేయని దుర్మార్గపు పనులు ప్రధాని మోడీ చేశారు.చేనేత కార్మికులపై 5 శాతం జీఎస్టీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, సీబీఐ, ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సాయంతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం, అభివృద్ధి పేరుతో బీజేపీ మీ వేలుతో మీ కండ్లనే పొడుస్తోంది.ఇలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.బీజేపీకి బుద్ధి రావాలంటే చేనేత కార్మిక కుటుంబాలు ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని పిలుపునిచ్చారు.
ప్రజలు తమ ఓటు హక్కును ఆలోచించి వేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధికి పాల్పడే వారి కోసం ఈ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.ప్రస్తుతం వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
4 లక్షల విద్యుత్ సామర్థ్యం ఉన్నా.

దేశంలో 4 లక్షల మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంది.అయినా రోజుకు 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి ఉపయోగించడం లేదు.తెలంగాణలో తప్పా ఏ రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.
కేంద్రం కార్పొరేట్ల జేబులు నింపేందుకు ప్రైవేటీకరణ పాలసీని తీసుకొచ్చిందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి.
కార్పొరేటర్ల జేబులు నింపుతోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.సంస్కరణల పేరుతో ఇళ్లకు మీటర్లు పెడుతున్నారని, విద్యుత్ మీటర్లపై కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.
బీజేపీని వ్యతిరేకిస్తోన్న కేంద్రం దృష్టి ప్రస్తుతం తెలంగాణపై ఉందన్నారు.ఇతర రాష్ట్రాల ప్రజలను ఎలా మోసం చేస్తుందో.
ఇప్పుడు బీజేపీ కన్ను తెలంగాణపై పడిందన్నారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఆలోచించి తమ ఓటు హక్కును టీఆర్ఎస్‌కు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.