బీజేపీ లో టికెట్ల లొల్లి ! ప్రాధాన్యం తగ్గడం పై సీనియర్ల అసంతృప్తి ?

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది తెలంగాణ బిజెపిలో( Telangana BJP ) గ్రూపు రాజకీయాలు అసంతృప్తులు , తెరపైకి వస్తున్నాయి .పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని , సీనియర్లైన తమను పక్కన పెట్టే విధంగా జూనియర్ నాయకులు వ్యవహరిస్తున్నారని వీరికి అధిష్టానం కూడా మద్దతు పలుకుతోందనే అసంతృప్తితో తెలంగాణ బీజేపీలోని కొంతమంది నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .

 Telangana Bjp Senior Leaders Dissatisfied With First List Of Tickets Allocation-TeluguStop.com

ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో చాలామంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.నిర్మల్ బిజెపి అధ్యక్షురాలు రమాదేవి( Ramadevi ) కన్నీటి పర్యంతం అయ్యారు వరంగల్ వెస్ట్ టికెట్ రావు పద్మకు దక్కడంతో రాకేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు .తనకు టిక్కెట్ వస్తుందని భావించిన విక్రం గౌడ్ కు బిజెపి టికెట్ నిరాకరించింది.

Telugu Amith Sha, Bjp List, Bjp Senior, Dk Aruna, Kishan Reddy, Komatirajagopal,

గోషామహల్ టికెట్ కోసం విక్రమ్ గౌడ్( Vikram Goud ) తీవ్రంగా ప్రయత్నించారు.ఇక మునుగోడు నుంచి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) ఇష్టపడడం లేదు.తనకు ఎల్బీనగర్ టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు.

అయితే ఎల్బీనగర్ టికెట్ ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం ఇష్టపడటం లేదు.దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారట.

మరోవైపు మొదటి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి( Vivek Venkataswamy ) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ధర్మపురి నుంచి పోటీ చేసేందుకు వివేక్ వెంకటస్వామి ఆసక్తి చూపిస్తున్నారు .అయితే చెన్నూరు నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం సూచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.కానీ చెన్నూరు నుంచి పోటీ చేసేందుకు వివేక్ ఇష్టపడడం లేదు.

Telugu Amith Sha, Bjp List, Bjp Senior, Dk Aruna, Kishan Reddy, Komatirajagopal,

ఇక బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ( DK Aruna ) పరిస్థితి ఇదే విధంగా ఉంది. మహబూబ్ నగర్,  నారాయణపేట స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నారు .అయితే గద్వాల నుంచి పోటీ చేయాలని డీకే అరుణ్ పై పార్టీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.దీంతో ఆమె కూడా ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

మొదటి అభ్యర్థుల జాబితాలో జితేందర్ రెడ్డి( Jithender Reddy ) పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు .ఇక మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తాండూర్ నుంచి పోటీ చేయాలని భావించారు.  ఆయన పేరు మొదటి జాబితాలో లేదు.దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.  జనసేనకు కేటాయించిన టికెట్ల పైన పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది .తెలంగాణలో ఏ మాత్రం బలం లేని జనసేనకు 12 టిక్కెట్లు కేటాయించడంపై పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.పార్టీ నిర్ణయాలు బీఆర్ఎస్ కు కలిసొచ్చేలా ఉన్నాయని, వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండా బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహంతో తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube