బిజెపిలో గ్రూపులు.. కాంగ్రెస్ దూకుడు !

తెలంగాణలో అధికారం  అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిలు పోటీ పడుతున్నాయి.రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నాయి.

 Telangana Bjp Party Incharges Group Politics Details, Telangana Bjp, Telangana C-TeluguStop.com

బీఆర్ఎస్ ప్రభుత్వంపై( BJP ) జనాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని , అదే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్, బిజెపిలు అంచనా వేస్తున్నాయి.ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో,  మూడోసారి ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని ఈ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి.

ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో,  తెలంగాణలో గెలిచేందుకు రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ వ్యవహారం ఇలా ఉండగానే ,తెలంగాణ బిజెపిలో గ్రూప్ రాజకీయాలు( BJP Group Politics ) పెరిగిపోయాయి.

ఇటీవల కాలంలో నాయకులు మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది.అయినా ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దే విధంగా బిజెపి తెలంగాణ ఇన్చార్జిలు బాధ్యత తీసుకోవాల్సి ఉన్నా, వారు అంతంత మాత్రమే గానీ ఇక్కడ వ్యవహారాలను చూస్తుండడం ఇబ్బందికరంగా మారింది.

తెలంగాణలో పై చేయి సాధించేందుకు బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించుకున్నాయి.తెలంగాణ కాంగ్రెస్( Congress )  ఇన్చార్జిగా మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే ఉండగా,  బిజెపి నుంచి తెలంగాణ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నలుగురు పర్యవేక్షిస్తున్నారు.

Telugu Aicc, Bandi Sanjay, Revanth Reddy, Sunil Bansal, Tarun Chugg, Telangana B

బీజేపీ జాతీయ సంస్థగత ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్,  సునీల్ బన్సల్ తో పాటు,  పొలిటికల్ ఇన్చార్జిగా తరుణ్ చుగ్, సహా ఇన్చార్జిగా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు.తెలంగాణ బిజెపిలో అన్ని తామే వ్యవహరిస్తూ గ్రూపు రాజకీయాలకు  చెక్ పెట్టి అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ను ఎదుర్కొనే విధంగా వ్యవహారం రూపొందించాల్సిన బాధ్యత వీరిపైనే ఉన్నా, వీరు అంతంత మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇదే బిజెపి వెనుకబాటుకు కారణంగా విమర్శలు వస్తున్నాయి.ఇటీవల కాలంలో బిజెపిలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.తరచుగా అసమ్మతి నేతలంతా భేటీ అవుతూ తెలంగాణ బిజెపి ఇన్చార్జి బండి సంజయ్ కి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తూ, బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు.

Telugu Aicc, Bandi Sanjay, Revanth Reddy, Sunil Bansal, Tarun Chugg, Telangana B

అయినా ఇప్పుడు వరకు తెలంగాణ ఇన్చార్జీలు ఈ వ్యవహారాలను పట్టించుకోకుండా , గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వంటివి ఆ పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత దూకుడుగా ఉంది .తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తగ్గుముఖం పట్టాయి.పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల కాంగ్రెస్ సీనియర్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube