తెలంగాణ బీజేపీ నేతలు( Telangana BJP Leaders ) ఢిల్లీకి ( Delhi )పయనం కానున్నారు.ఈ మేరకు ఎల్లుండి రాష్ట్ర నేతలు హస్తినకు వెళ్లనున్నారు.
అక్కడ ఎల్లుండి జరిగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి వీరంతా హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
అయితే తెలంగాణలో వరంగల్ ఎంపీ( Warangal Parliament ) స్థానంతో పాటు ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ స్థానాన్ని కూడా బీజేపీ పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
కాగా వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేశ్( Aroori Ramesh ) పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
కానీ ఖమ్మం పార్లమెంట్ స్థానంపై మాత్రం కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.మరోవైపు పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.







