BJP : రేపటి నుంచి తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు..!!

త్వరలో లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ( BJP ) సిద్ధం అవుతోంది.

ఈ మేరకు రేపటి నుంచి రాష్ట్ర బీజేపీ బస్సు యాత్రలు నిర్వహించనుంది.

మార్చి ఒకటి వరకు కొనసాగనున్న ఈ బస్సు యాత్రలకు విజయసంకల్ప యాత్రలుగా నామకరణం చేశారు.ఈ నేపథ్యంలో ముందుగా హైదరాబాద్ లోని ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం విజయసంకల్ప యాత్ర ప్రచార రథాలను ఆయన ప్రారంభించనున్నారు.కాగా రాష్ట్రంలోని మొత్తం ఐదు క్లస్టర్లలో బీజేపీ ఒకేసారి బస్సు యాత్రలను ప్రారంభించనుంది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు అస్సాం, గోవా ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు