తెలంగాణతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొత్త సర్కార్ హయాంలో తొలి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తున్నారు.ఈ సమావేశాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.
ఈ క్రమంలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.







