ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది.ఐదు లేదా వారం రోజులపాటు శాసనసభా సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది.
ఈనెల 10న సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీకానుంది.ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర వైఖరిపై సమావేశాల్లో చర్చించనున్నారు.అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ల నియామకంతో పాటు గవర్నర్ వైఖరిపై చర్చించే ఛాన్స్ ఉంది.
తెలంగాణ గవర్నర్ రీకాల్ , కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.